Kamaneeya Maina:
కమనీయమైన నీ ప్రేమలోన
నే నిలువనా నా యేసయ్యా
(తీయ) తీయని నీ పలుకలలోన
నే కరిగిపోనా నా యేసయ్యా ||2||
నా హృదిలో కొలువైన నిన్నే
సేవించనా/సేవించెదా నా యేసయ్యా ||2||
1. విస్తారమైన ఘన కీర్తి కన్నా
కోరదగినది నీ నామం
జుంటె తేనె ధారల కన్నా
మధురమైనది నీ నామం ||2||
సమర్పణతో నీ సన్నిధిని చేరి
నిత్యము నిన్నే ఆరాధించనా ||2|| ||కమనీయమైన||
2. వేసారిపోయిన నా బ్రతుకులో
వెలుగైన నిన్నే కొనియాడనా ||2||
కన్నీటితో నీ పాదములు కడిగి
మనసారా నిన్నే పూజించనా ||2||
నీ కృపలో గతమును వీడి
మరలా నీలో చిగురించనా ||2|| ||కమనీయమైన||