Kadalakunduvu:
కదలకుందువు సీయోను కొండవలె
బెదరకుందువు బలమైన సింహం వలె ||2||
యేసయ్య నీ చెంత ఉండగా
ఏ చింత నీకింక లేదుగా ||2||
1. కష్టములెన్నో కలుగుచున్ననూ
నిట్టూర్పులెన్నో వచ్చియున్ననూ
దుష్ట జనములుపై దుమికి తరిమిన
భ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా ||కదలకుందువు||
2. నీటి వరదలు నిలువెత్తున వచ్చినా
నిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినా
ఆకాశము నుండి పై అగ్ని కురసినన్
ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు ||కదలకుందువు||
3. నీరు కట్టిన తోటవలెను
నిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెను
నీటి కాల్వల యోరను నాటబడినదై
వర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్ ||కదలకుందువు||