Isuka Meeda Illu:
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది
బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది ||2||
వాన కురిసి వరద వస్తే
గాలి తోడై విసిరి కొడితే ||2||
మాట వినని వాని ఇల్లు కూలిపోయెను
లోబడని వాని ఇల్లు కూలిపోయెను
వాని సొగసైన ఇల్లు కూలిపోయెను ||2||
బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది ||2||
వాన కురిసి వరద వస్తే
గాలి తోడై విసిరి కొడితే ||2||
మాట వినిన వాని ఇల్లు నీటుగుండెను
లోబడిన వాని ఇల్లు నీటుగుండెను
వాని సొగసైన ఇల్లు నిలిచియుండెను ||2||
జోరు వాన హోరు గాలి వరద పోటు
ఆ ఇంట ముంగిట తెల్లబోయెగా ||2||
బండ మీద ఇల్లు కట్టి
సాటి ఏదని చాటి చెప్పి ||2||
బండ అయిన యేసు మీద
నీ బ్రతుకు ఇంటిని కట్టుకోవయ్యా
బండ అయిన యేసు మీద
నీ బ్రతుకు ఇంటిని కట్టుకోవమ్మా
చావు వద్ద తీర్పు వద్ద
కూలిపోని కాలిపోని ||2||
నిత్య జీవం పొందరావయ్యా
సజీవుడైన యేసు దేవుని స్వీకరించయ్యా
నిత్య జీవం పొందరావమ్మా
సజీవుడైన యేసు దేవుని స్వీకరించమ్మా
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది
బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది (5)