Israyelu Deva:
ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా
నిరంతరము స్తోత్రములకు పూజార్హుడా ||2||
ఏమని నిన్ను నేను కీర్తింతును
ఏమని నిన్ను నేను పూజింతును ||2||
ఏమని నిన్ను నేను ఆరాధింతును ||2||
ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా నీకు ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా ||ఇశ్రాయేలు||
నా పితరులెందరో నిన్ను ఘనపరచి
దహనబలులు నీకు అర్పించగా ||2||
ఇంపైన సువాసనగా అంగీకరించి
దీవెన వర్షము కురిపించితివే ||2|| ||ఆరాధనా||
నా హృదయ క్షేత్రములో నిన్నారాధించి
స్తుతుల సింహాసనము నీకు వేయగా ||2||
ఆనంద తైలముతో నన్నభిషేకించి
స్తోత్రగీతముతో నన్ను నింపితివే ||2|| ||ఆరాధనా||
నా కొరకు సీయోనును సిద్ధపరచి
మహిమతో తిరిగి రానైయుంటివే ||2||
ఆనంద ధ్వనులతో నన్నూరేగించి
శాశ్వత జీవము నాకిచ్చితివే ||2|| ||ఆరాధనా||