Inthalone Kanabadi :
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే
అల్పమైన దానికా ఆరాటం
త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి
స్వల్పమైనదానికా పోరాటం
కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం
దాటిపోవును ఇల నీ సంపదలన్నియు ||2|| ||ఇంతలోనే||
బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా
అంతరించిపోయెను భువినేలిన రాజులు ||2||
నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా
చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా ||ఇంతలోనే||
మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో
ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో ||2||
ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున
చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో ||ఇంతలోనే||