Idigo Deva Naa Jeevitham song lyrics: Dr Y.Babji
ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం ||2||
శరణం నీ చరణం ||4|| ||ఇదిగో||
1. పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి ||2||
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం ||ఇదిగో||
2. నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము ||2||
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో||
3. విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు ||2||
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో||
This song is written by Dr Y.Babji. The song had already been printed in UESI-Andhra Pradesh (EU) song book VIDYARTHI GEETHAVALI 20 years back or more. Please acknowledge the writers of the song when you publish it in public.
ధన్యవాదాలు
This song is written by Y.Babji during 1987-88. He was a student then associated with UESI AP. One can find this song in Vidyarthi Geethavali of UESI.Babji is now working as a scientist. I request the people to acknowledge his name wherever the song is found.it is one of the many songs he has written.
ధన్యవాదాలు
Sister please give brief details above the UESI AP and Anna garu Babji gurinchi