Idhi Chitram Kaada : Raju Richards
ఇది చిత్రం కాదా దేవుడే భువికి వచ్చెను-ఇది చిత్రం కాదా పరమునే విడిచి వచ్చెను ||2||
నిన్ను నన్ను రక్షింపను పాప శాపం తొలగింపను||2||
ఈ లోకానికి వచ్చెను
ఇదియే క్రిస్మస్ అర్ధం గ్రహియించు ఈ పరమార్ధం||2||
అర్పించు నీ హృదయం
1.లోకాన్నే ఏలేటోడు దీనుడై దిగివచ్చాడు ||2||
తల్లిలా లాలించేటోడు తల్లి ఒడిలో పవళించాడు||2||
దీనత్వం చూపించాడు
2.పాపులకు రక్షణ తెచ్చాడు రోగులకు స్వస్థతనిచ్చాడు ||2||
జీవ వాక్యం బోధించాడు జీవితాలను వెలిగించాడు ||2||
నిత్యజీవాన్ని మనకిచ్చాడు
Love you jesus christ is jesus is god