ఎవరు ఉన్నా లేకున్నా
యేసయ్య ఉంటే నాకు చాలు ||2||
అందరి ప్రేమ అంతంత వరకే
యేసయ్య ప్రేమ అంతము వరకు ||2|| ||ఎవరు||
కునుకడు నిదురపోడు
కాపాడుతాడు నన్నెప్పుడు ||2||
ఆపదొచ్చినా అపాయమొచ్చినా ||2||
రాయి తగలకుండ నన్ను ఎత్తుకుంటాడు ||2|| ||అందరి||
తల్లి మరచినా తండ్రి విడచినా
నాతోనే ఉంటాడు ఎల్లప్పుడు ||2||
ముదిమి వచ్చినా తల నెరిసినా ||2||
చంక పెట్టుకొని నన్ను మోస్తాడు ||2|| ||అందరి||
అలసిన కృషించినా
తృప్తి పరచును నన్నెల్లప్పుడు ||2||
శత్రువొచ్చినా శోధనలు చుట్టినా ||2||
రెక్కలు చాపి నన్ను కాపాడును ||2|| ||అందరి||