ఎవరూ లేక ఒంటరినై
అందరికి నే దూరమై ||2||
అనాథగా నిలిచాను
నువ్వు రావాలేసయ్యా ||4||
స్నేహితులని నమ్మాను మోసం చేసారు
బంధువులని నమ్మాను ద్రోహం చేసారు ||2||
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను ||2||
నువ్వు రావాలేసయ్యా ||4|| ||ఎవరు లేక||
నేనున్నాను నేనున్నానని అందరు అంటారు
కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు ||2||
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను ||2||
నువ్వు రావాలేసయ్యా ||4|| ||ఎవరు లేక||
చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి
శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి ||2||
దీనుడనై అంధుడనై
అనాథగా నే నిలిచాను ||2||
నువ్వు రావాలేసయ్యా ||4|| ||ఎవరు లేక||