ఎరుగనయ్యా నిన్నెప్పుడు ||2||
నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా ||2|| ||ఎరుగనయ్యా||
నీ ప్రేమ శాశ్వతమేగా ||2||
నీ కరుణ సాగరమేగా ||2||
నిను కొలువ భాగ్యమే కదా ||2||
నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా ||2|| ||ఎరుగనయ్యా||
నీ పలుకే తీర్చునాకలి ||2||
నీ స్మరణము కూర్చు బలిమిని ||2||
నీ బ్రతుకే వెలుగు బాట ||2||
నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా ||2|| ||ఎరుగనయ్యా||
వలదయ్యా లోక భ్రాంతి ||2||
కడు భారము ఘోర వ్యాధి ||2||
నిను చేరిన నాకు మేలు ||2||
నీ రక్షణ చాలు చాలు.. నా ప్రభువా ||2|| ||ఎరుగనయ్యా||