Entho vintha Song lyrics :
ఎంతో వింత యెంతో చింత
యేసునాధు మరణ మంత ||2||
పంతము తో జేసి రంత
సొంత ప్రజలు స్వామి నంత ||2|| ||ఎంతో||
1. పట్టి కట్టి నెట్టి కొట్టి
తిట్టి రేసు నాధు నకటా ||2||
అట్టి శ్రమల నొంది పలుక
డాయె యేసు స్వామి నాడు ||2|| ||ఎంతో||
2. మొయ్యలేని మ్రాను నొకటి
మోపి రేసు వీపు పైని ||2||
మొయ్యలేక మ్రాని తోడ
మూర్చబోయే నేసు తండ్రి ||2|| ||ఎంతో||
3. కొయ్యపై నేసయ్యన్ బెట్టి
కాలు సేతులలో జీలల్ ||2||
కఠిను లంత గూడి కొట్టిరి
ఘోరముగ క్రీస్తేసున్ బట్టి ||2|| ||ఎంతో||
4. దాహము గొన చేదు చిరక
ద్రావ నిడిరి ద్రోహు లకటా ||2||
ధాత్రి ప్రజల బాధ కోర్చి
ధన్యుడా దివి కేగె నహహా ||2|| ||ఎంతో||
5. బల్లెముతో బ్రక్కన్ బొడవన్
పారే నీరు రక్త మహహా ||2||
ఏరై పారే యేసు రక్త
మెల్ల ప్రజల కెలమి నొసగు ||2|| ||ఎంతో|