Entho Madhuram song lyrics :
ఎంతో మధురం నా యేసు ప్రేమ
ఎంతో క్షేమం నా తండ్రి చెంత ||2||
ఎనలేని ప్రేమను నాపైన చూపి
ప్రాణంబు పెట్టిన మన తండ్రి ప్రేమ ||2|| ||ఎంతో||
1. నా నీతికి ఆధారము
నా త్రోవకు వెలుగువై ||2||
దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక ||2|| ||ఎంతో||
2. పరిశుద్ధులకు పరిశుద్ధుడవు
ప్రభులకు ప్రభుడవు నా యేసయ్యా ||2||
ఈ పాప లోకంలో నీ ప్రాణమర్పించి
పరలోకమునకు మార్గము చూపావు ||2|| ||ఎంతో||
For Video Song: – ఎంతో మధురం
