ఎంత ప్రేమో నాపై యేసయ్యా
నేను ఎలాగ వివరించగలనయ్యా ||2||
పెంట కుప్పలలో పడి ఉన్ననూ
నా మెడ మీద పడి ముద్దు పెట్టితివా
జిగట ఊబిలో నేను దిగి ఉన్ననూ
నా చేయి పట్టి నను పైకి లేపితివా ||ఎంత||
1. దాహం తీర్చగలేని బావి అయిననూ
నేను పాపపు కుండను విడువకుంటిని ||2||
నా పాపమంత క్షమించితివి ||2||
జీవ జలమిచ్చి నన్ను చేర్చుకుంటివి ||2|| ||ఎంత||
2. పందులున్న చోట నలిగి పడి ఉంటిని
నా పాపమే చుట్టు ముట్టి పట్టుకున్నది ||2||
బుద్ధి వఛ్చి నేను నిన్ను ఆశ్రయించగా ||2||
క్షమియించి నీ రక్షణిచ్చితివి ||2|| ||ఎంత||
3. నరికిన కొమ్మ వలె ఎండిపోతిని
నా పాపాన్ని దాచి దాచి నశించితిని ||2||
ఒప్పుకొనగా నాకు జీవమిచ్చితివి ||2||
(ఎండిన) మొద్దును చిగురింపజేసితివి ||2|| ||ఎంత||