Entha Pedda Porathamo:
ఎంత పెద్ద పోరాటమో
అంత పెద్ద విజయమో ||2||
పోరాడతాను నిత్యము
విజయమనేది తథ్యము ||2||
1. వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి
విశ్వాసమనే డాలుని చేత పట్టి ||2||
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవాదే యుద్ధమనుచు ||2|| ||ఎంత||
2. ప్రార్థన యుద్ధములో కనిపెట్టి
సాతాను తంత్రములు తొక్కి పెట్టి ||2||
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవా నిస్సీ అనుచు ||2|| ||ఎంత||
3. యేసు కాడిని భుజమున పెట్టి
వాగ్ధాన తలుపు విసుగక తట్టి ||2||
ముందుకే దూసుకెళ్లెదన్
సిలువలో సమాప్తమైనదనుచు ||2|| ||ఎంత||