Entha Manchi Kaapari song lyrics :
ఎంత మంచి కాపరి – యేసే నా ఊపిరి ||2||
తప్పిపోయిన గొర్రె నేను
వెదకి కనుగొన్నావయ్యా
నీ ప్రేమ చూపినయ్య ||2|| ||ఎంత||
1. సుఖములంటూ లోకమంటూ
నీదు భాగ్యం మరచితి
నీదు సన్నిధి విడచితి ||2||
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
నా అతిక్రమములు క్షమియించి
జాలి చూపితివి ||2|| ||ఎంత||
2.నా తలంపులు నా క్రియలు
నీకు తెలిసేయున్నవి
నీవే నిర్మాణకుడవు ||2||
యేసయ్యా ప్రేమ మూర్తివయ్యా
కృతజ్ఞతా స్తుతులు నీకు
సమర్పించెదను ||2|| ||ఎంత||