Entha Jaali Yesuva:
ఎంత జాలి యేసువా
యింతయని యూహించలేను ||ఎంత||
1. హానికరుడ హింసకుడను
దేవదూషకుడను నేను ||2||
అవిశ్వాసినైన నన్ను ||2||
ఆదరించినావుగా ||ఎంత||
2. రక్షకుండ నాకు బదులు
శిక్ష ననుభవించినావు ||2||
సిలువయందు సొమ్మసిల్లి ||2||
చావొందితివి నాకై ||ఎంత||
3. ఏమి నీ కర్పించగలను
ఏమి లేమి వాడనయ్యా ||2||
రక్షణంపు పాత్రనెత్తి ||2||
స్తొత్రమంచు పాడెద ||ఎంత||
4. నీదు నామమునకు యిలలో
భయపడెడు వారి కొరకై ||2||
నాథుడా నీ విచ్చు మేలు ||2||
ఎంత గొప్పదేసువా ||ఎంత||
5. నేను బ్రతుకు దినములన్ని
క్షేమమెల్ల వేళలందు ||2||
నిశ్చయముగ నీవు నాకు ||2||
ఇచ్చువాడా ప్రభువా ||ఎంత||
6. నాదు ప్రాణమునకు ప్రభువా
సేద దీర్చు వాడ వీవు ||2||
నాదు కాపరివి నీవు ||2||
నాకు లేమి లేదుగా ||ఎంత||
7. అందరిలో అతి శ్రేష్ఠుండా
అద్వితీయుడగు యేసయ్యా ||2||
హల్లెలూయ స్తోత్రములను ||2||
హర్షముతో పాడెద ||ఎంత||