ఎంత దూరమైనా అది ఎంత భారమైనా ||2||
యేసు వైపు చూడు నీ భారమంత తీరు ||2||
తీరానికి చేరు ||2|| ||ఎంత||
నడచి నడచి అలసిపోయినావా
నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా ||2||
కలువరి గిరి దనుక సిలువ మోసిన
నజరేయుడేసు నీ ముందు నడవగా ||2|| ||యేసు||
తెలిసి తెలిసి జారిపోయినావా
తెలియరాని చీకటిలో చిక్కుబడినావా ||2||
నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే
పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా ||2|| ||యేసు||