Enduko deva inthati prema song lyrics :
ఎందుకో దేవా ఇంతటి ప్రేమా
ఎన్నిక లేని నరుని మీద ||2||
మమతకు ప్రేమకు అర్హత లేని ||2||
మంటిపై ఎందుకు ఇంత ప్రేమ ||ఎందుకో||
1. ఎందుకు పనికిరాని నన్ను
ఎన్నుకొంటివి ఎందుకయ్యా ||2||
ఎంచితివి నీ పుత్రికగా నన్
పెంచితివి నీ కృపతో నన్ను ||ఎందుకో||
2. సర్వ పాపముల పరిహారి
సర్వ జనులకు ఉపకారి ||2||
శాపము నొందిన దోషి మీద
శాశ్వత ప్రేమను చూపితివా ||ఎందుకో||
3. నాశ మార్గములో బ్రతికిన నన్ను
నీతి మార్గముకు పిలిచితివా ||2||
నిత్యము నీతో యుండుటకు
పాపిని నన్ను పిలచితివా ||ఎందుకో||