ఎనలేని ప్రేమ నాపైన చూపి
నరునిగా వచ్చిన నా దేవా
నా పాపము కొరకు రక్తమును కార్చి
ప్రాణమునర్పించిన నా దేవా ||2||
ఊహించగలనా వర్ణింప తగునా
ఆ గొప్ప సిల్వ త్యాగము ||2||
ఆ గొప్ప సిల్వ త్యాగము ||ఎనలేని||
కొరడాలతో హింసించినా
మోముపై ఉమ్మి వేసినా ||2||
చెమట రక్తముగా మారినా ||2|| ||ఊహించగలనా||
ముళ్ల కిరీటముతో మొత్తినా
బల్లెముతో ప్రక్క పొడచినా ||2||
పరలోక తండ్రియే చేయి విడచినా ||2|| ||ఊహించగలనా||