ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను
ఎలా విడువగలనయ్యా నీ సేవను ||2||
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||2|| ||ఎలా మరువగలనయ్యా||
ఆత్మీయులే నన్ను ఆదరించలేదు
ప్రేమించువారే ప్రేమించలేదు ||2||
ఆదరించావు ప్రేమించావు ||2||
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు ||2|| ||ఎలా మరువగలనయ్యా||
బంధువులే నన్ను ద్వేషించినారు
సొంత తల్లిదండ్రులే వెలివేసినారు ||2||
చేరదీసావు సేదదీర్చావు ||2||
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు ||2|| ||ఎలా మరువగలనయ్యా||
అనాథగా నేను తిరుగుచున్నప్పుడు
ఆకలితో నేను అలమటించినప్పుడు ||2||
ఆదరించావు ఆకలి తీర్చావు ||2||
అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు ||2|| ||ఎలా మరువగలనయ్యా||