ఏగెదను నే చేరెదను
సీయోనును నే చూచెదను ||2||
విశ్వాస కర్తయైన నా యేసూ ||2||
నీ సముఖములో నే మురిసెదను
నీ కౌగిలిలో ఉప్పొంగెదను ||2||
జీవ కిరీటమును నే పొందెదను ||ఏగెదను||
భూదిగంతములకు నీ కాడిని – నే మోయుచున్నాను
యేసూ నీ యొద్దనే నాకు – విశ్రాంతి దొరుకును ||2||
దినదినము నాలో నే చనిపోవుచున్నాను
అనుదినము నీలో బ్రతుకుచున్నాను ||2||
అనుదినము నీలో బ్రతుకుచున్నాను ||ఏగెదను||
నా ఆత్మీయ పోరాటములో దేవా – నీవే నా కేడెము
సదా నిన్నే నేను ధరియించి – సాగిపోవుచున్నాను ||2||
మంచి పోరాటముతో నా పరుగును
కడముట్టించి జయమొందెదను ||2||
విశ్వాసములో జయమొందెదను ||ఏగెదను||