ఈ దినం సదా నా యేసుకే సొంతం
నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును ||2||
రానున్న కాలము – కలత నివ్వదు ||2||
నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును ||ఈ దినం||
ఎడారులు లోయలు ఎదురు నిలచినా
ఎన్నడెవరు నడువని బాటయైనను ||2||
వెరవదెన్నడైనను నాదు హృదయము ||2||
గాయపడిన యేసుపాదం అందు నడచెను ||2|| ||ఈ దినం||
ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా
యుద్ధకేక నా నోట యేసు నామమే
విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు
యెహోవా నిస్సియే నాదు విజయము ||ఈ దినం||