Devuniki bayapadavaa song lyrics:
దేవునికి భయపడవా మానవా
నీ దేవునికి భయపడవా మానవా ||2||
పాపాన్ని విడువుమా – ప్రభు చెంత చేరుమా ||2||
యేసయ్యను నీవు శరణు వేడుమా ||2|| ||దేవునికి||
ఐగుప్తు మంత్రసానుల గమనించితివా
రాజాజ్ఞను సైతము అతిక్రమించిరి ||2||
దేవునికి విధేయత చూపిరి
వంశాభివృద్ధిని పొందిరి ||2|| ||దేవునికి||
నినెవె ప్రజలను గమనించితివా
దేవుని మాటకు లోబడినారు ||2||
పాపమును విడిచి ఉపవాసముండి
ప్రార్థించి ప్రభు దీవెన పొందిరి ||2|| ||దేవునికి||