Christmas Kaalam : Suresh Nittala
క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమే
రాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే ||2||
ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే
ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే ||2|| ||క్రిస్మస్ కాలం||
పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలో
లోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో ||2||
యూదా గోత్రములో – ఒకతార కాంతిలో ||2|| ||క్రిస్మస్ కాలం||
కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను
బంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు ||2||
దూతలు స్త్రోత్రించిరి – ఆ ప్రభుని ఘనపరచిరి ||2|| ||క్రిస్మస్ కాలం||
ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా
మన పాప పరిహార బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా
ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగా
మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా ||2||
ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమే
ఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే ||2|| ||క్రిస్మస్ కాలం||