Athyunnathamainadi song lyrics :
అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామం
అత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామం
ఉన్నత నామం – సుందర నామం
ఉన్నత నామం – శ్రీ యేసు నామం
అన్ని నామములకు పై నామం – పై నామం – పై నామం
యేసు నామం – యేసు నామం ||2||
1. ప్రతి మోకాలు యేసు నామంలో నేల వంగును
ప్రతి నాలుక యేసే దైవమని అంగీకరించును ||2||
పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా
పరలోక దీవెనలు పొందగ చేరుము
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||అత్యున్నత||
2. పరిశుద్ధుడైన యేసు నామంలో సాతాను పారిపోవున్
మృతిని గెల్చిన యేసు నామంలో స్వస్థత దొరుకును ||2||
పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమా
పరలోక దీవెనలు పొందగ చేరుము
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||అత్యున్నత||