Athyunnatha Simhasanamupai song lyrics :
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా
సాగిలపడి నమస్కారము చేసేదా ||2||
1.ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే ||2||
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో ||2|| ||అత్యున్నత||
2.పరిమలించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే ||2||
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో ||2|| ||అత్యున్నత||
3.పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే ||2||
యెహోవ నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో – స్తుతి గీతాలతో ||2|| ||అత్యున్నత||