Anthya Dhinamandhu :
అంత్య దినమందు దూత – బూర నూదు చుండగా
నిత్యవాసరంబు తెల్లవారగా – రక్షణందుకొన్నవారి
పేళ్లు పిల్చుచుండగా – నేను కూడ చేరియుందునచ్చటన్
నేను కూడ చేరియుందున్ – నేను కూడ చేరియుందున్
నేను కూడ చేరియుందున్ – నేను కూడ చేరి యుందు నచ్చటన్
2. క్రీస్తునందు మృతులైన
వారు లేచి క్రీస్తుతో
పాలుపొందునట్టి యుదయంబునన్
భక్తులార కూడిరండి
యంచు బిల్చుచుండగా
నేను కూడ చేరియుందు నచ్చటన్.
3. కాన యేసుసేవ ప్రత్య
హంబు చేయుచుండి నే
క్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్
కృప నొందు వారి పేళ్లు
యేసు పిల్చుచుండగా
నేను కూడ చేరియుందునచ్చటన్
For video Song Click here :
