అమ్మల్లారా ఓ అక్కల్లారా ||2|| ఈ వార్త వినరండే యేసయ్యను నమ్ముకొండే ||2|| 1. మానవ జాతి పాపము కొరకై ||2|| కన్నీరు విడుస్తుండు ప్రభు రమ్మని పిలుస్తుండు ||2|| ||అమ్మల్లారా|| 2. లోకమంతటా యేసు రక్తము ||2|| ఎరువుగ జల్లిండే మరణపు ముల్లును విరిచిండే ||2|| 3. అమ్మల్లారా ఓ అక్కల్లారా ||2|| ఓ పల్లె చెల్లెల్లారా ఓ పట్నం అక్కల్లారా ||2|| 4. బట్టలు మార్చితే బ్రతుకు మారదు గుండు కొడితే నీ గుణం మారదు బతుకు మారడం బట్టల్ల లేదు గుణం మారడం గుండుల లేదు నీ మనసు మారాలన్నా నీ బుద్ది మారాలన్నా నీ మనసు మారాలక్కా నీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా|| 5. పాపం లేని యేసు దేవుణ్ణి నమ్ముకుందామమ్మా దేవుడు మంచి దేవుడమ్మా ||2|| 6. అమ్మల్లారా ఓ అక్కల్లారా ||2|| ఈ సత్యమినరండే ఇది కల్ల కాదు చెల్లె ఇది కల్ల కాదు తమ్మి ఇది కల్ల కాదు తాత ఇది కల్ల కాదు అవ్వ ఇది కల్ల కాదు అన్న ఇది కల్ల కాదు అక్క |