Ambhara Veedhilo song lyrics:
అంబరవీధిలో తారక – వెలసెను తూర్పున వింతగా
యూదుల రాజుని పుట్టుక – లోకానికి ప్రకటించగా
1. జ్ఞానులు తారను గమనించి – బెత్లెహేమునకు పయనించి
శిశువును గని సంతోషించి – మ్రొక్కిరి కానుకలర్పించి
2. అంధకారమును తొలగించి – హృదయపు దీపము వెలిగించి
వాక్యమే ఇల నిజతారకలా – నడుపును మార్గము బోధించి
3.జగతికి యేసును చూపించి – జనులకు రక్షణ చాటించి
ప్రతి క్రైస్తవుడొక తారకలా – నిలవాలి వెలుగును పంచి