Alankarinchunu song lyrics:
నా మనస్సా ఆయన మరచునా
దేవుడు నిన్ను మరచిపోవునా (2)
ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే
ఆనంద తైలము నీపై కుమ్మరించునే ||2||
స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే
కోల్పోయినదంతా పునరుద్ధరించునే ||2||
1. నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో
సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే||2||
తరిగిపోను నేను – అణగార్చబడను నేను||2||
2. సరిచేయు వాడే – ఓ ….స్థిరపరచినాడే
బలపరచినాడే – పూర్ణుణ్ణి చేయునే
సరి చేసి నిన్ను – హెచ్చించిన ప్రభువు
ఈ నూతనవత్సరములో – అలంకరించునే…
3.విచారించే వారు లేక – ఒంటరైయున్న నీకు
ఆరోగ్యము దయచేసి – పరిపాలన నిచ్చునే||2||
కూలిన కోటను – రాజగృహముగా మార్చును ||2||
||స్తుతింపజేయునే|| ||నా మనస్సా||