ADHAARAMA NAA YESAYYA SONG LYRICS:
ఆధారమా నా యేసయ్య
ఆలించుమా నా ప్రార్ధన
మదిలోని ప్రతి భారం – మనసార పాడే మౌన గీతం
నీకే ఆలాపన – ప్రియమైన ఆరాధన
ఏది గెలుపు – ఏది మలుపు – తలచి చూడ – నిదుర రాదే
ఓటమైన – ఒంటరైన – కరుణ చూపి – నడిపినావు
వ్యధలలోన – విసిగిపోయి – పాదములనే చేరగా
స్థితిని చూచి – స్తుతిగ మార్చి – దీవెనలతో నింపవా
దీవెనలతో నింపవా
నీదు వదనం – కాంతి కిరణం – కనులలోని – ప్రేమ మధురం
ఎదురు చూసే – జీవ గమనం – బదులు పంపే – సిలువ రుధిరం
కడలిలోన – కరముచాపి – ఆదరించే దైవమా
దీనురాలి – దరికిచేరి – దీవెనలతో నింపవా
దీవెనలతో నింపవా