Adagaka Mundhe song lyrics:
అడగక ముందే అక్కరలెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే
బంధాలను పెంచిన భాగ్యవంతుడా
పదే పదే నేను పాడుకోనా
ప్రతి చోట నీ మాట నా పాటగా
మరి మరి నే చాటుకోనా
మనసంతా పులకించని సాక్షిగా
నా జీవిత గమనానికి గమ్యము నీవే
చితికిన నా గుండెకు ప్రాణం నీవే (2) ||పదే పదే||
మమతల మహా రాజా
(నా) యేసు రాజా(4)
1. అడగక ముందే అక్కరలెరిగి
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
ఎందరు ఉన్నా బంధువు నీవే
బంధాలను పెంచిన భాగ్యవంతుడా(2)
అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
బంధాలను పెంచిన భాగ్యవంతుడా(2) ||మమతల||
2. అలిగిన వేళ అక్కున చేరి
అనురాగం పంచిన అమ్మవు నీవే
నలిగిన వేళ నా దరి చేరి
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే(2)
అనురాగం పంచిన అమ్మవు నీవే
నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే(2) ||పదే పదే||
For Video Song Click Here: Adagaka Mundhe – అడగక ముందే
