Aayane Naa Sangeethamu Song lyrics:
ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే||
స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే ||2||
వేడుచుండు భక్తుల స్వరము విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే ||2|| ||ఆయనే||
ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన ||2||
ఉండెదననిన మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించెదము ||2|| ||ఆయనే||
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించెదము ||2||
రాకడలో ప్రభుతో నిత్యముందుము
మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము ||2|| ||ఆయనే||