ఆవేదన నేనొందను
అవమానముతో నే కృంగను
ఆనందమే నా జీవితం ||2||
నా యేసుని బాహూవులో
హల్లెలూయా హల్లెలూయా ||2||
హల్లెలూయా ఆనందమే ||ఆవేదన||
నాకేమి కావలెనో నేనేమి కోరెదనో ||2||
నా ఊహలకు ఊపిరి పోసి
కోరిన ఈవుల నొసగిన ఉన్నతమైన అద్భుతమైన
నీ కార్యములు ఆశ్చర్యమే ||2|| ||హల్లెలూయా||
కష్టాల కెరటాల సుడిగుండమందున ||2||
కలవరమొంది కృంగిన నన్ను
కరుణతో పరమున చేర్చి శిఖరముపైన నిలిపిన దేవా
కృపలన్నియు కురిపించితివి ||2|| ||హల్లెలూయా||