Aaradhincheda song lyrics :
ఆరాధించెద నిను మది పొగడెద
నిరతము నిను స్తుతియించెదను ||2||
మార్గము నీవే సత్యము నీవే ||2||
జీవము నీవే నా ప్రభువా ||2|| ||ఆరాధించెద||
విస్తారంబగు వ్యాపకములలో
విడచితి నీ సహవాసమును ||2||
సరిదిద్దితివి నా జీవితము ||2||
నిను సేవింపగ నేర్పిన ప్రభువా ||2|| ||ఆరాధించెద||
నీ రక్తముతో నను కడిగితివి
పరిశుద్దునిగా జేసితివి ||2||
నీ రక్షణకై స్తోత్రము చేయుచు ||2||
నిత్యము నిన్ను కొనియాడెదను ||2|| ||ఆరాధించెద||
పెద్దలు పరిశుద్దులు ఘన దూతలు
నీ సన్నిధిలో నిలచిననూ ||2||
లెక్కింపగజాలని జనమందున ||2||
నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా ||2|| ||ఆరాధించెద||
For Video Song:
