Aaradhana Anduko song lyrics :
ఆరాధన అందుకో ||2||
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో
అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా
మోషేతో అన్నావు ఉన్నానని ||2||
అల్ఫయు నీవే ఓమెగయును ||2||
ఆద్యంత రహితుండ నీవేనని
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో
పాపంబున జన్మించి నశియించితిని
లోకంబు నాదనుచు ఆశించితిని ||2||
అయినా నీవు రక్షణ నివ్వ ||2||
వెలిగించి పంపితివి యేసు ప్రభును
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో
ఆరాధన అందుకో
తెలిసికొంటిని నా యేసు నిన్ను
సర్వ శక్తి గల ప్రభువనియు ||2||
రానున్నావు మరలా నాకై ||2||
ఆనంద దేశములో నన్నుంచుటకై
ఘనతా మహిమా నీకేయని
హల్లెలూయా గానము చేసెదను
పాప క్షమాపణ జీవమునిచ్చిన
కరుణామయా.. అందుకో ||ఆరాధన||