Aanandamu Prabhu Song lyrics :
ఆనందము ప్రభు నాకొసగెను
నా జీవితమే మారెను ||2||
నా యుల్లమందు యేసు వచ్చెన్
నా జీవిత రాజాయెను ||2|| ||ఆనందము||
ప్రభుని రుచించి ఎరిగితిని
ఎంతో ఎంతో ప్రేమాముర్తి ||2||
విశ్వమంతట నే గాంచలేదు
విలువైన ప్రభు ప్రేమను ||2|| ||ఆనందము||
అలల వలె నా సంతోషము
పైకి ఉప్పొంగి ఎగయుచుండె ||2||
నన్ను పిలిచి మేలులెన్నో చేసే
నూతన జీవమొసగెన్ ||2|| ||ఆనందము||
శత్రువున్ ఎదిరించి పోరాడెదన్
విజయము పొంద బలమొందెదన్ ||2||
ప్రభువుతో లోకమున్ జయించెదన్
ఆయనతో జీవించెదన్ ||2|| ||ఆనందము||