Aaha Yemaanandam:
ఆహా యేమానందం ఆహా యేమానందము
చెప్ప శక్యమా ||2||
ఆహా మా రాజగు యేసు మా వృజినముల
మన్నించి వేసెను ||2|| ||ఆహా||
ముదముతో నాడుచు కూడుచు పాడుచు
ఆర్భాటించెదము ||2||
వెదకుచు వచ్చిన యేసును హృదయాన
కోరి స్తుతింతుము ||2|| ||ఆహా||
అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను
గ్రహించినందున ||2||
రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము
నిశ్చయముగా నిత్తుము ||2|| ||ఆహా||
తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము
మేడపై జయ జెండాల్ ||2||
ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన
రాజున్ స్తుతింతుము ||2|| ||ఆహా||