Aagani Parugulo:
ఆగని పరుగులో ఎండిన ఎడారులు ||2||
కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు
ఉన్నపాటునా నలిగె నా వైపున
కదలిరాలేవా ఆదరించగ రావా
కన్నీరే నా మజిలీ – దరి చేరే నీ జాలి
లాలించే నీ ప్రేమ – నా ప్రాణమై
కరుణించే నీ చూపు – మన్నించే నా మనవి
అందించే నీ చేయి – నా స్నేహమై ||ఆగని||
లోకప్రేమే సదా – కలల కడలే కదా
తరంగమై కావుమా – తిరిగి తీరమునకు ||2||
నీవే కదా ఆధారం – సదా నీకే దాసోహం
యేసయ్యా… అర్పించెదా – నా జీవితం ||ఆగని||
ఎదుట నిలిచె నీవే – ప్రేమకు రూపం నీవే
కృపామయా కావుమా – జార విడువకు నన్ను ||2||
నీవే కదా నా మూలం – సదా నీపై నా భారం
యేసయ్యా… ప్రేమించెదా – కలకాలము ||ఆగని||