Aadhaaram Neevenayya Song lyrics:
ఆధారం నీవేనయ్యా ||2||
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం||
లోకంలో ఎన్నో జయాలు
చూసాను నేనింత కాలం ||2||
అయినను ఎందుకో నెమ్మది లేదు ||2||
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం||
ఐశ్వర్యం కొదువేమి లేదు
కుటుంబములో కలతేమి లేదు ||2||
అయినను ఎందుకో నెమ్మది లేదు ||2||
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం||
నీ సేవకునిగా జీవింప
హృదయంలో ఉన్నకోర్కెలను ||2||
హృదయము నిచ్చావు నెమ్మది నొందా ||2||
సాక్షిగా జీవింతును
హల్లేలూయ సాక్షిగా జీవింతును ||ఆధారం||