Aa raaje naa raaju:
ఆ రాజే నా రాజు – నా రాజే రారాజు
నా రాజు రాజులకు రాజు ||2||
యేసు పుట్టెను ఈ లోకంలో
ఆనందమే గొప్ప ఆనందమే ||2||
ఆనందమే గొప్ప ఆనందమే
సంతోషమే సర్వలోకమే ||2|| ||ఆ రాజే||
1. యెష్షయి మొద్దున – దావీదు చిగురుగా
లోక రక్షకుడు జన్మించెను
లోక పాపాలను కడిగి వేయగా
భువిలో బాలుడిగా అరుదించెను ||2||
పరిశుద్ధాత్మ మూలముగా జన్మించెను
మన పాపాలకు విరుగుడు మందును (తెచ్చెను) (తెచ్చి అందించెను) ||2|| ||ఆనందమే||
2. వీనుల విందుగా – దీనుల అండగా
కరుణా కారకుడు కడలివచ్చెను
పాపుల శాపాలను తానే మోయగా
పరమ పాలకుడు పుడమి చేరెను ||2||
కుల మత బేధాలను హరియించ వచ్చెను
పరలోకానికి చేర్చే (మార్గమాయెను) (మార్గమై తనే నిలిచెను) ||2|| ||ఆనందమే||