Anjali Ghatiyinthu song lyrics:
అంజలి ఘటియింతు దేవా (2)
నీ మంజుల పాదాంబుజముల కడ
నిరంజన మానస పరిమళ పుష్పాంజలి ||అంజలి||
1. పరమాత్మ నీ పాద సేవ
చిరజీవ సంద్రాన నావ(2)
సిలువ మహా యజ్ఞ సింధూర
రక్తా రుణమేయ సంభావనా(2)
దేవా దేవా యేసు దేవా(2)
అంజలి ఘటియింతు దేవా ||అంజలి||
2. అవతార మహిమా ప్రభావ
సువిశాల కరుణా స్వభావ(2)
పరలోక సింహాసనాసీన
తేజో విరాజమాన జగదావనా(2)
దేవా దేవా యేసు దేవా(2)
అంజలి ఘటియింతు దేవా ||అంజలి||