Karuna Chupinchumaa: Sayaram Gattu
కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగా
మహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా ||2||
నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాము
ఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము ||2||
కరుణగల దేవుడు నీవు
కరుణించి కాపాడుమా ||2|| ||కరుణ||
1. ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివి
గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి ||2||
నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడాము
నీ మహిమను తిరిగి చూడగా – నీ సన్నిధిలో చేరాము ||2|| ||కరుణగల||
2. ఇశ్రాయేలు వారిగ మేము – నీ ఉనికిని ప్రశ్నించాము
నీ ప్రేమను రుచి చూసిననూ – మారాను కురిపించాము ||2||
చెలరేగే సర్పము కాటు – మములను కబళించే వేళ
మాకు దిక్కు నీవేనంటూ – మోకరించి నిను వేడితిమి ||2|| ||కరుణగల||
3. మరణమునే జయించి నీవు – సజీవుడిగా నిలిచావు
నిన్ను నమ్మి వేడిన చాలు – మా తప్పులు మరిచావు ||2||
నేను జీవించితి గనుక – మీరును జీవించెదరన్న
వాగ్దానము నమ్మితిమయ్యా – నెరవేర్చుము మా యేసయ్య ||2|| ||కరుణగల||