Kanneellatho Pagilina:
కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా
మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా ||2||
విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను
కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును ||2||
విడువడు నిన్ను
1. రాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినా
కాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునా
ప్రాణమిచ్చి ప్రేమ పంచినా – పేరు పెట్టి నిన్ను పిలచినా
నీ చేయి పట్టి విడచునా – అనాథగా నిన్ను చేయునా ||విడువడు||
2. అంధకారమడ్డు వచ్చినా – సంద్రమెంత ఎత్తు లేచినా
నిరాశలే పలకరించినా – క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా
బాధ కలుగు దేశమందునా – బంధకాలు ఊడకుండునా
శత్రువెంతో పగతో రగిలినా – గిన్నె నిండి పొర్లకుండునా ||విడువడు||