enno enno melulu:
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా ||2||
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ ||2|| ||ఎన్నో||
బాధలలో మంచి బంధువువైనావు
వ్యాధులలో పరమ వైద్యుడవైనావు ||2||
చీకటి బ్రతుకులో దీపము నీవై
పాపములన్నియు కడిగిన దేవా ||2||
నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా ||2|| ||ఎన్నో||
శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు ||2||
హృదయ వేదన తొలగించినావు
కృపా క్షేమముతో నడిపించినావు ||2||
నా కోసం భువికొచ్చిన దైవ మానవా
నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా ||2|| ||ఎన్నో||