ఉత్సాహ గానము చేసెదము
ఘనపరచెదము మన యేసయ్య నామమును ||2||
హల్లెలూయ యెహోవ రాఫా
హల్లెలూయ యెహోవ షమ్మా
హల్లెలూయ యెహోవ ఈరే
హల్లెలూయ యెహోవ షాలోమ్ ||2||
అమూల్యములైన వాగ్ధానములు
అత్యధికముగా ఉన్నవి ||2||
వాటిని మనము నమ్మినయెడల
దేవుని మహిమను ఆనుభవించెదము ||2|| ||హల్లెలూయ||
వాగ్ధాన దేశము పితరులకిచ్చిన
నమ్మదగిన దేవుడాయన ||2||
జయించిన వారమై అర్హత పొంది
నూతన యెరుషలేం ఆనుభవించెదము ||2|| ||హల్లెలూయ||