ఉదయమాయె హృదయమా
ప్రభు యేసుని ప్రార్ధించవే ||2||
పదిలముగా నిను వదలకుండా
పడక నుండి లేపెనే ||2|| ||ఉదయమాయె||
రాత్రి గడచిపోయెనే
రవి తూర్పున తెలవారెనే ||2||
రాజా రక్షకుడేసు దేవుని
మహిమతో వివరించవే ||2|| ||ఉదయమాయె||
తొలుత పక్షులు లేచెనే
తమ గూటి నుండి స్తుతించెనే ||2||
తండ్రి నీవే దిక్కు మాకని
ఆకాశమునకు ఎగిరెనే ||2|| ||ఉదయమాయె||
పరిశుద్ధుడా పావనుండా
పరంధాముడా చిరంజీవుడా ||2||
పగటియంతయు కాచి మము
పరిపాలించుము దేవుడా ||2|| ||ఉదయమాయె||
తండ్రి దాతవు నీవని
ధరయందు దిక్కు ఎవరని ||2||
రాక వరకు కరుణ చూపి
కనికరించి బ్రోవుమా ||2|| ||ఉదయమాయె||