Sakalaaseervaadhamula:
సకలాశీర్వాదముల కారణభూతుడ యేసు నా ప్రియుడా || 2 ||
నీ మేలులు తలంచుచుండ స్తుతి గానమే పెదవుల నిండా|| 2||
జయశీలుడా విభుడా పరిపూర్ణుడా హితుడా || 2 || ||సకలా||
అన్నపానం లోటు రానీకుండా
కార్యము చేసిన పోషకుడా || 2 ||
ఆరోగ్యములను కుదుటపరచి || 2||
ఆయుష్షు పెంచేవాడా ||జయశీలుడా || ||సకలా||
జీవా మార్గం తప్పిపోని కుండా
జ్ఞానము నేర్పిన ప్రాపకుడా || 2 ||
ఆటంకములను అనువుపరిచి || 2 ||
ఆకాంక్ష తీర్చేవాడా ||జయశీలుడా|| ||సకలా||
కాయ కష్టం పాడు కానీకుండా
లాభము కూర్చిన శ్రీ కరుండా || 2 ||
ఆదాయములను పదిలపరిచి || 2 ||
ఆధిక్యమిచ్చే వాడ ||జయశీలుడా|| ||సకలా||