O Yaatrikudaa Song lyrics:
ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా
బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా..
ఓ బాటసారి ఓహో బాటసారి
జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా
గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపొతుంది
నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది ||2||
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం ||2|| ||ఓ యాత్రికుడా||
పుట్టగానే తొట్టెలో వేస్తారు
గిట్టగానే పెట్టెలో మూస్తారు
జాగు చేయక కాటికి మోస్తారు
ఆరడుగుల గుంటలో తోస్తారు ఆ అ ఆ. ఆ.. ||2||
బ్రతుకు మూల్యమింతే – మనిషికి ఉన్న విలువంతే ||2||
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం ||2|| ||ఓ యాత్రికుడా||
ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు
ఏడిపిస్తూ సమాధికి పోతావు
కూడబెట్టినవి మోసుకు పోలేవు
ఆశించినవేవి నీ వెంటారావు ఓ ఒ ఓ..ఓ.. ||2||
జీవిత సారము ఇంతే – మనిషి బ్రతుకు భావము అంతే ||2||
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం ||2|| ||ఓ యాత్రికుడా||
మరణము ఒక నిద్ర యేసునందు
అంతము అది కాదు క్రీస్తునందు
మృతులు లేచుట స్థిరము యేసునందు
నిత్య జీవము వరము క్రీస్తునందు ఆ అ ఆ.. ఆ.. ||2||
నేడే రక్షన సమయము – ఇక ఆలసించిన నరకము ||2||
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం ||2|| ||ఓ యాత్రికుడా||