O Prardhnaa Suprardhana song lyrics :
ఓ ప్రార్ధనా సుప్రార్ధనా
నీ ప్రాభావంబున్ మరతునా
నా ప్రభువున్ ముఖా ముఖిన్
నే బ్రణుతింతు నీ ప్రభన్
నా ప్రాణమా సు ప్రార్ధనా
నీ ప్రేరణంబుచే గదా
నీ ప్రేమధార గ్రోలుదు
నో ప్రార్ధనా సుప్రార్ధనా
పిశాచి నన్ను యుక్తితో
వశంబు చేయ జూచుచో
నీ శాంతమైన దీప్తియే
నా శంక లెల్ల మానుపున్
నీ శక్తి నేను మరతునా
నా శైలమున ప్రార్ధనా
నా శోక మెల్ల దీర్చెడు
విశేషమైన ప్రార్ధనా
నీ దివ్యమైన రెక్కలే
నా దుఃఖ భార మెల్లను
నా దేవుడేసు చెంతకు
మోదంబు గొంచు బోవును
సదా శుభంబు లొందను
విధంబు జూప నీవెగా
నా ధైర్యమిచ్చుఁ ప్రార్ధనా
సుధా సుధార ప్రార్ధనా
అరణ్యమైన భూమిలో
నా రమ్యమౌ పిస్గా నగం
బు రంగుగాను నెక్కి నా
చిర గృహంబు జూతును
శరీరమున్ విదల్చి నే
బరంబు బోవు వేళలో
కరంబు నిన్ను మెచ్చెదన్
పరేశు ధ్యాన ప్రార్ధనా
For Video Song: O Prardhnaa Suprardhana
